మనిషి రక్తం రుచి మరిగిన పులికి, వేటాడటానికి మనుషులు దొరక్కపోతే ఏ రకంగా పిచ్చెక్కుతుందో… అధికారం పోయిన చంద్రబాబుకు అదే రకంగా పిచ్చి హిమాలయాలకు చేరిందంటూ.. మంత్రి గుడివాడ అమర్‌నాథ్ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. విశాఖ అభివృద్ధి కావాలా? రాజధాని కావాలా అని అడిగిన చంద్రబాబును… అమరావతి అభివృద్ధి కావాలా? లేక రాజధాని కావాలా అని మేం అడుగుతున్నామన్నారు. దేశంలోకెల్లా అత్యధిక డీబీటీ ద్వారా ఈ రోజుకు దాదాపు 1.39 లక్షల కోట్లు… అది కూడా కేవలం 35 నెలల్లో పేదల చేతిలో పెట్టిన ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలో ఈ గుంట నక్కకు తెలియటం లేదంటూ ఆయన మండిపడ్డారు.
చివరికి దేశంలో కెల్లా అత్యధిక ధరలు, పన్నులు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని, చంద్రబాబు పాలనలో స్కీములు లేవు… డీబీటీలు లేవంటూ ఆయన విమర్శించారు. జన్మభూమి కమిటీల దోపిడి కింద స్థాయిలో, జల యజ్ఞం దోపిడీ, రాజధాని పేరిట దోపిడీ, ఇసుక పేరిట దోపిడి, మద్యం పేరిట దోపిడి పై స్థాయిలో ఉన్నాయని, జగన్‌గారి ప్రభుత్వం అమలు చేస్తున్న నవ రత్నాల్లో బాబు తన 5 ఏళ్ళ పాలనలో ఏ ఒక్కటి అయినా అమలు చేశాడా? అని ప్రశ్నించారు. నవరత్నాల్లో జగనన్న అమ్మ ఒడి, వైయస్సార్ ఆసరా, వైయస్సార్ చేయూత, 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్, 31 లక్షల ఇళ్ళ నిర్మాణం, జగనన్న గోరుముద్ద, నాడు–నేడు… ఇలాంటి స్కీముల ఏ ఒక్కటి అయినా ఉన్నాయా? అని ఆయన అమర్‌నాథ్ అన్నారు.