ప్రకృతిలో మనకు అందుబాటుల్లో ఉన్న ఆహారాల్లోకల్లా..అతిబలమైన ఆహారం ఎండువిత్తనాలు. బలం అంటే..మాంసాహారం అనుకుంటారు. కానీ వాస్తవానికి మాంసాహారం కంటే 7రెట్లు బలమైన ఆహారాలు ఎండువిత్తనాలు( డ్రై ఫ్రూట్స్). పదార్థం తక్కువ అందులో ఉండే పోషకాలు ఎక్కువ. పిట్టకొంచెం కూతఘనం అన్నట్లు విత్తనాలు అన్నీ కొంచమే ఉంటాయి కానీ అందులో ఎసెన్స్ ఎక్కువగా ఉంటాయి. పరమాణువులో పవర్ ఎక్కువ ఉంటుందన్నట్లు..ఈ ఎండువిత్తనాలకు పవర్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ తింటే..తక్కువ శక్తి, తక్కువ పోషకాలు వచ్చేవి తినకూడదు..తక్కువ తింటే ఎక్కువ శక్తిని ఇచ్చేవి తినగలిగితే..ఇది ఆరోగ్యానికి బలానికి మంచిది. ఎండువిత్తనాలు అనేక రకాలు ప్రకృతి మనకు ప్రసాదించింది. అందులో ఒకటైన హెజల్ నట్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం.
మనందరికి బాదం, జీడిపప్పు, వాల్ నట్స్, పిస్తా ఇవే బాగా తెలుసు. మీరు డబ్బులు పెట్టి కొనగలిగితే..దీన్ని కూడా ఈసారి విక్రయించండి.. ఇది కేజీ 1300- 1500మధ్యలో ఉంటుంది. ఇందులో ఉన్న పోషకాలు బలం వింటే మీరు ఆశ్యర్యపోతారు కూడా.
100 గ్రాముల హెజల్ నట్స్ లో ఉండే పోషక విలువలు
100గ్రాములు హెజల్ నట్స్ తీసుకుంటే 628 కేలరీల శక్తి, 100 గ్రాముల చేపల్లో కూడా 90 క్యాలరీలే ఉంటాయి. అలాగే..కోడిమాంసంలో 109 కాలరీలు, మేకమాంసంలో 118 కాలరీలు మాత్రమే ఉంటాయి. కానీ హెజల్ నట్స్ లో 628 కాలరీల శక్తి ఉంటుంది. ప్రొటీన్ అనేది 15 గ్రాములు, కార్బోహైడ్రేట్స్ 17 గ్రాములు, కొవ్వు 60 గ్రాములు ఉంటాయి. ఫ్యాట్స్ వల్ల ఘగర్ పెరగదు, కండపుష్టికి, దారుడ్యానికి చాలా మంచిది. హెల్తీ ఫ్యాట్ ఇది. ఇందులో 10 గ్రాములు పీచుపదార్థం ఉంది . ప్రేగుల క్లీనింగ్ ఇది బాగా ఉపయోగపడుతుంది. పొటాషియం 680మిల్లీ గ్రాములు ఉంది. ఎక్కువ పొటాషియం ఉంటే..బీపీ తగ్గడానికి, బ్లడ్ విజల్స్ కి, బ్రెయిన్ సెల్స్ కి, బాడీలో కణజాలం శక్తిని విడుదల చేయడాని చాలా మంచిది. మన శరీరంలో హానికలిగించే..ఫ్రీ రాడికల్స్ ప్రమాదభరితమైన, విషపూరితమైన నష్టాన్ని కలిగించే ఫ్రీ రాడికల్స్ భారినుండి రక్షించడానికి ఇది ముఖ్యంగా ఉపయోగపడుతుంది.
ఫ్రీరాడికల్స్ అంటే ఏంటంటే..
అసలు ఫ్రీ రాడికల్స్ అంటే..ఉదాహరణకు..సమాజంలో..విలన్స్ ఉన్నట్లు..శరీరంలో ఈ చెడు రాడికల్స్ ఉంటాయి. ఇవి ఎక్కడ నుంచి వస్తాయి అంటే..మనం తినే ఆహార పదార్థాల ద్వారా, తయారు చేసే పద్థతిలో వచ్చే నష్టాల ద్వారా ఎక్కువగా తయారు అవుతాయి. అలాంటి ఫ్రీ రాడికల్స్ ఏయే ఆహారాల ద్వారా ఎక్కువ వెళ్తాయంటే..నూనెలో దేవిన పదార్థాలు, నూనెలో మరిగినప్పుడు ఆ వేడికి ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. లాభం పోగా నష్టం ఎక్కువ ఉంటుంది. 250డిగ్రీలు వేడి ఎక్కితేనే నూనె మరుగుతుంది. ఇంకా అంచులవైపు మాడతాయి. అలా మాడితేనే కొందరికి ఇష్టం. ఇవన్నీ క్యాన్సర్ ప్రేరకాలగా మారుతాయి. శరీరానికి విషపూరితాలుగా పనిచేస్తాయి. అలాగే వేపుళ్లు చేసినప్పుడు మాడిపోతుంటాయి. ఇంకా టిఫెన్స్ చేసినప్పుడు..దోశలు, పుల్కాలు చేసేప్పుడు మాడుతాయి.. ఆ మాడినవి కూడా తినేస్తారు. అవన్నీ ఫ్రీ రాడికల్స్ లా మారిపోతాయి. ఇంకా ఓవెన్ లో అతి వేడిగి గురిచేసిన పదార్థాలు…కేక్స్, బిస్కెట్స్, కొన్ని ఫాస్ట్ ఫుడ్స్ అత్యధికమైన హీట్ కు గురిచేసినవన్నీ ఫ్రీ రాడికల్స్ ను ఫామ్చేస్తాయి. ఇవన్నీ క్యాన్సర్ ప్రేరకాలే.
ఫ్రీ రాడికల్స్ మన శరీరంలోపలికి వెళ్లి ఆరోగ్యంగా పనిచేసుకునే కణజాలను పాడుచేసి..లోపల డీఎన్ఏ ను పాడు చేస్తాయి. ఎలా అయితే సమాజంలో రౌడీలు అమాయకప్రజలకు ఆటంకం కలిగిస్తారో, వాళ్లను గాయపరిచడం..అలా ఈ ఫ్రీ రాడికల్స్ శరీరంలో కణజాలన్ని పాడు చేస్తాయి. ఈ ఫ్రీ రాడికల్స్ డామేజ్ ను అరికట్టడానికి అద్భుతంగా హెజల్ నట్స్ పనికొస్తాయని సైంటిస్టులు నిరూపించారు…రోజుకి 30 గ్రాములు చొప్పున 8 వారాలు తింటే. 40 శాతం ఫ్రీ రాడికల్స్ డామేజ్ తగ్గిందని కనుగొన్నారు. 2015 వ సంవత్సరంలో యూనివర్శిటీ ఆఫ్ మిలాన్ ఇటలీ దేశస్తులు స్పెషల్ గా ఈ నట్స్ మీద పరిశోధన చేసి ఈ విషయం వెల్లడించారు.
వీటిని తినడం వల్ల వచ్చే లాభాలు:
వీటిని రెగ్యులర్ గా తింటూ ఉంటే..గుండెలో ఉండే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరుకుంటంది కదా..అది తగ్గుతుంది. ఎల్టీఎల్ అనే బాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. క్యాన్సర్ రాకుండా, ఒకవేళ క్యాన్సర్ వచ్చినా స్ప్రెడ్ అవకుండా రక్షించడానికి అద్భుతంగా హెజల్ నట్స్ పనికొస్తాయి.
ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉండటంతో..ప్రేగులు క్లీనింగ్, గుడ్ బ్యాక్టిరియా ఫామ్ అవడానికి, మోషన్ సుఖంగా అవడానికి బాగా ఉపయోగపడతాయి.
తొక్కతోపాటే తినాలి. మగవారికి వీర్యకణాలు DNAను హెల్తీగా ఉండేట్లు చేయడానికి, స్పామ్ క్యాలిటీ పెంచడానికి కూడా ఇవి పనికొస్తాయని పరిశోధనలో చెప్పారు.
డయాబెటిస్ ఉన్నవారికి హేజల్‌నట్స్ ఎంతో మేలు చేస్తాయి. వీటిని రోజూ తింటే షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవచ్చని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. నిత్యం ఒక గుప్పెడు హేజల్‌నట్స్ తింటే షుగర్ అదుపులో ఉంటుంది.
హేజల్‌నట్స్‌ను రోజు 4 వారాల పాటు తీసుకుంటే శరీరంలో ఆయా భాగాల్లో ఉండే నొప్పులు తగ్గిపోతాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో రుజువైంది.
థైరాయిడ్ సమస్య ఉన్నవారు హేజల్‌నట్స్‌ను తినాలి. వీటిల్లో ఉండే మాంగనీస్ థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగు పరుస్తుంది. థైరాయిడ్‌ను సరిగ్గా పనిచేయిస్తుంది. దీంతో థైరాయిడ్ వ్యాధులు తగ్గుతాయి. శరీర మెటబాలిజం కూడా సరిగ్గా ఉంటుందట.
వీటిల్లో ఉండే ప్రొ ఆంథోసయనిడిన్స్ పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూస్తాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి.
ఇలాంటి లాభాలు అన్నీ మనం పొందాలంటే..రోజుకు 15-30గ్రాములు మన అరుగదలను బట్టి తినాలి. వీటిని నానపెట్టి తొక్కతోపాటు తినాలి అనేక రకాల పరిశోధనల ద్వారా ఈ విషయాలన్నీ నిరూపించబడ్డాయి కాబట్టి వీలైతే వీటిని తినేందుకు ట్రై చేయండి.
-Triveni Buskarowthu