రజనీకాంత్ కు తామెందుకు క్షమాపణలు చెప్పాలి : గుడివాడ అమర్నాథ్‌

-

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై సినీ నటుడు సూపర్‌స్టార్‌ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలనే వ్యతిరేకించామని మంత్రి అమర్నాథ్‌ అన్నారు. సినిమాల్లో మాత్రమే రజనీకాంత్ సూపర్‌స్టార్‌ అని, ఒక్కసారి చెబితే వందసార్లు ఫీల్ అవడానికి రాజకీయాలు సినిమా కాదని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. ఈ విషయం అర్థమయ్యే రజనీకాంత్ పార్టీ విషయంలో వెనక్కి తగ్గారనుకుంటున్నానని మంత్రి అమర్నాథ్‌ పేర్కొన్నారు.

రజనీకాంత్ కు ఈ విషయం అర్థమయ్యే పార్టీ పెట్టడంపై వెనుకంజ వేసి ఉంటారని అమర్నాథ్ పేర్కొన్నారు. ఓ దొంగ, ఓ హంతకుడు సభ ఏర్పాటు చేస్తే, ఆ సభకు రావడమే కాకుండా, పొగడ్తలు కురిపిస్తే చూస్తూ ఊరుకుంటారా? అని ఆగ్రహం వెలిబుచ్చారు. సినిమాల్లో మాట్లాడినట్టు బయట మాట్లాడితే కౌంటర్ తప్పదని హెచ్చరించారు. రజనీకాంత్ కు తామెందుకు క్షమాపణలు చెప్పాలని నిలదీశారు. చంద్రబాబు గురించి రజనీకాంత్ చెప్పిన వాటిల్లో వాస్తవాలు లేవు కాబట్టే తాము వ్యతిరేకిస్తున్నామని అమర్నాథ్ స్పష్టం చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version