లోకేష్‌కి మట్టి కుండలో ఉత్తరాంధ్ర ఉప్పు, కారం కలిపిన పప్పు పంపిన మంత్రి అమర్నాథ్‌….?

-

ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆంధ్రా రాజకీయాల్లో వేడి పెరిగింది. విమర్శలు, ప్రతివిమర్శలు,సవాళ్లు, ప్రతిసవాళ్లే కాదు.. ఇప్పుడు..గిఫ్ట్‌లు.. రిటర్న్‌ గిఫ్ట్‌ల దాకా చేరింది వ్యవహారం.అనకాపల్లిలో శంఖారావం సభ నిర్వహించిన నారా లోకేష్‌…..పరిశ్రమలు, ఐటీ మంత్రి అమర్నాథ్ రాష్ట్రానికి ఏమీ చేయలేదని ఆరోపిస్తూ లోకేశ్ ఆయనకు కోడిగుడ్డు బహుమతిగా పంపారు. గుడ్డు పాలసీతో అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ పరువు తీశారని లోకేశ్ మండిపడ్డారు.

దీంతో.. కౌంటర్‌ ఎటాక్‌కు దిగిన మంత్రి గుడివాడ అమర్నాథ్…. లోకేష్‌కు రిటర్న్‌ గిఫ్ట్‌ పంపిస్తున్నట్టు మీడియా సమావేశంలో ప్రకటించారు.. ఓ కుండలో ఉడికించిన పప్పును తీసుకొచ్చారు.శంఖారావం అని పలకడం కూడా తెలియని మొద్దు లోకేష్ అని మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు. లోకేష్ కోడిగుడ్డు గిఫ్ట్ కు రిటర్న్ గిఫ్ట్‌ ఇదే.. మట్టి కుండలో ఉడికించిన పప్పు …. ఉప్పు, కారం కలిపి సిద్ధంగా ఉంచాం.. లోకేష్ తనంతట తానుగా వచ్చినా సరే.. లేకపోతే నేనే పంపిస్తాను అంటూ ఎద్దేవ చేశారు. తాను బ్యాక్ డోర్ పొలిటీషియన్ కాదని, కష్టపడి వచ్చానని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version