నేడు మంగళగిరి జనసేన కార్యాలయంలో ఇప్పటంలో ఇల్లు కూల్చివేత బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఒక్కొక్కరికి లక్ష ఆర్థిక సాయం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసిపి ప్రభుత్వం పై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
వైసిపి గడప కూల్చే దాకా వదిలిపెట్టబోమని, వైసిపి పార్టీ కోటలు బద్దలు కొడతామని హెచ్చరించారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మంత్రి అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ. మంత్రి అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ” ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడినట్లు పవన్ కళ్యాణ్ వైఖరి ఉందంటూ చురకలంటించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
పిట్ట కొంచెం.. కూత ఘనంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ఇప్పటంలో గ్రామం అభివృద్ధి కోసం రోడ్లు విస్తరిస్తూ ఉంటే ఆయనకు అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీలో ఏం చేశారో చూసామని, ఇప్పుడు కొత్తగా పవన్ ఏం చేయగలరని ఎద్దేవా చేశారు.