పొత్తు లేకుండా పోటీ చేసే సత్తా ఉందా.. అనీల్ కుమార్ స‌వాల్‌..

-

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ రెండో రోజు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. జై అమరావతి అంటూ పెద్దగా నినాదాలు చేశారు. దీంతో టీడీపీ సభ్యులపై మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలోకి వస్తూనే బ్యాడ్ మార్నింగ్ అంటున్నారని మండిపడ్డారు. శాసనసభలో ఎస్సీ కమిషన్ పై చర్చ సందర్భంగా… అమరావతిపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. అమరావతి నినాదాలతో హోరెత్తించారు. ఈ ఆందోళనల మధ్య అనిల్ కుమార్ కు స్పీకర్ మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు.

ఎన్నికల ముందు ‘పసుపు- కుంకుమ’ పేరుతో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి ఇప్పుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ప్రతిపక్ష సభ్యులపై మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకుని, ఇప్పుడు జోలె పట్టుకుని అడుక్కుంటున్నారని అన్నారు. దోచుకోవడం తప్ప చంద్రబాబు ప్రభుత్వం చేసిందేమీ లేదని మండిపడ్డారు. సీఎం జగన్ సింగిల్‌ గా వెళ్తారు తప్ప టీడీపీలా పొత్తుల కోసం వైసీపీ వెళ్లదని తెలిపారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. 2024లో టీడీపీ పొత్తులు లేకుండా సింగిల్ గా ఎన్నికల్లో పోటీ చేసే సత్తా ఉందా అని సవాలు విసిరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version