ఆటో డ్రైవ‌ర్‌గా మారిన ఏపీ మంత్రి..

-

ఏపీ టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు శుక్రవారం వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ప్రారంభ కార్యక్రమంలో ఆటో డ్రైవర్‌ అవతారం ఎత్తారు. ఆయన ఆటో డ్రైవర్లతో మమేమకం అయ్యారు. ఆటో డ్రైవర్‌ షర్టు వేసుకుని ఆటో నడిపారు. కాగా విశాఖ బీచ్‌రోడ్డులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహం దగ్గర నుంచి గురజాడ కళాక్షేత్రం వరకూ మూడు కిలోమీటర్ల మేర భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. అనంత‌రం గురజాడ కళాక్షేత్రంలో వైఎస్సార్‌ వాహన మిత్ర కార్యక్రమాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్‌ ప్రారంభించారు.

ఈ క్ర‌మంలోనే లబ్ధిదారులకు పదివేల రూపాయల చొప్పున చెక్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ…‘తొలిసారిగా ఆటో నడిపే అవకాశం మీ ద్వారా కలిగింది. ఏ ఉద్యోగం లేని వ్యక్తులకు తొలి ఉద్యోగం ఇచ్చేది ఆటో మాత్రమే. రవాణా సదుపాయాలు లేకపోతే గ్రామీణ ప్రాంతాలలో కష్టాలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. ఆటో డ్రైవర్ల కష్టాలను స్వయంగా చూసి వారి కోసం వైఎస్సార్‌ వాహన మిత్ర పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టారు. అందరి కష్టాలను నేరుగా పాదయాత్రలో చూసిన వ్యక్తి సీఎం జగన్‌. అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఆయనది వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version