`సైరా` చిరు చేయ‌క‌పోతే.. ఆ హీరో చేశేవాడా..

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌గా అక్టోబ‌ర్ 2న తెర‌కెక్కిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఇక సైరా మూవీకి హిట్ టాక్ రావడంతో సంబరాలు చేసుకుంటున్నారు. అన్నివర్గాల ప్రేక్షకులు సైరా చిత్రానికి బ్రహ్మరధం పడుతున్నారు. ఇక టాలీవుడ్ ప్రముఖులు సైతం సైరా మూవీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే సక్సెస్ అందించిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలుపుతూ నిన్న చిత్ర యూనిట్ మీడియా సమక్షంలో ఒక వేదిక ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి చిరంజీవి, రామ్ చరణ్ లతో పాటుగా దర్శకుడు సురేంధర్ రెడ్డి, నటుడు జగపతి బాబు, తమన్నా, సీనియర్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్, సాయి మాధవ్ బుర్రా, రత్నవేలు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ 2004లో ఈ చిరంజీవితో ఆ చిత్రం చేయాలని ప్రయత్నాలు సాగుతున్నప్పుడు ఆయన 2008లో రాజకీయాలవైపు వెళ్లిపోయారు. అప్పుడు చిరు ఆయ‌న‌తో.. నేను కాక‌పోయినా.. చరణ్ తో ఈ మూవీ చేద్దాం అని చెప్పార‌ట‌. అయితే చిరంజీవి రాజ‌కీయాల్లోనే ఉండుంటే.. సైరా నరసింహారెడ్డి గా చరణ్ చేసేవాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version