గతంలో 1986 తర్వాత ఇంత పెద్ద స్థాయిలో గోదావరికి వరదలు వచ్చాయని, నిన్ననే ముఖ్యమంత్రి వెళ్లి పరామర్శించి వచ్చారని అన్నారు తాడేపల్లి మంత్రి బొత్స సత్యనారాయణ. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా ఉండాలని ముందు రాలేదని సీఎం చెప్పారని, 3.60 లక్షల మందిని పునరావాస కేంద్రాల్లో ఉంచామని, ఇప్పటికీ సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయన్నారు. 7 మంది చనిపోయారు..వారి కుటుంబాలకు సాయం అందించామన్నారు. మీకు డబ్బు ఇచ్చిన తర్వాతే పోలవరం నిర్వాసితులను తరలిస్తామని సీఎం స్పష్టంగా చెప్పారని, చంద్రబాబు వరద బాధితులను ఓదార్చడానికి వెళ్లి రాజకీయ ఉపన్యాసం చేస్తున్నాడన్నారు. నీ ఐదేళ్లలో వరద ఎప్పుడూ వచ్చింది చంద్రబాబు..? అసలు వర్షం ఎప్పుడన్నా పడిందా అని ఆయన ప్రశ్నించారు. పోలవరం ఆలస్యం అవడానికి కారణం ఏవరు…? నువ్వు కాదా…? నువ్వు 2014 తర్వాత మూడేళ్లు చిన్న పని కూడా చేయకుండా ఇప్పుడు నేను అంతా చేశాను అంటే నమ్మాలి.
కేంద్రంతో మాట్లాడి ఆరోజు అర్ అండ్ అర్ ప్యాకేజీ తీసుకురాలేదు..? నీ లాలోచీకి ప్రయోజనాలు తాకట్టు పెట్టిన విషయం అందరికీ తెలుసు. ఇవాళ తగుదునమ్మా అంటూ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు. అది కడుపు మంట…ప్రజలు అన్నీ అందాయి అంటుంటే ఓర్వలేక పోతున్నాడు. నీ కార్యకర్తలను పెట్టుకుని మైకుల్లో ఏదేదో మాట్లాడించారు. మా అధికారులు అంతా అద్భుతంగా పని చేశారు. మా కార్యకర్త నుంచి మంత్రుల వరకు సహాయక చర్యలు చేపట్టారు…అది మా ప్రభుత్వం బాధ్యత అన్నారు మంత్రి బొత్స. హెలికాప్టర్ ద్వారా 30 టన్నులు ఆహారం..పాల పాకెట్స్, బిస్కట్ లు అందించామని, ఈ ప్రభుత్వం ఎలా చేస్తుంది అని మా సీఎం బహిరంగంగా ప్రజల్ని అడిగారని, ప్రజలు అంతా బాగా జరిగింది అని జేజేలు కొట్టారన్నారు.