మనదేశంలోని గోవాలో క్యాసినో లీగల్‌ : చీకోటి ప్రవీణ్‌

-

నేపాల్‌ లో క్యాసినో ఈవెంట్ల నిర్వహణ వ్యవహారంలో నిందితుల్లో ఒకడిగా చికోటి ప్రవీణ్ లింకులు, చెల్లింపులు వెలుగుచూస్తున్నాయి. మల్లికా శెరావత్‌కు రూ. కోటి, ఈషా రెబ్బకు రూ.40 లక్షలు, గణేష్ ఆచార్యకు రూ.20 లక్షలు, ముమైత్ ఖాన్‌కు రూ.15 లక్షలు, అమీషా పటేల్‌కు రూ.80 లక్షలు, హయాతికి రూ.40 లక్షలు, గోవిందకు రూ.50 లక్షలు చొప్పున చీకోటి ప్రవీణ్ చెల్లించినట్టు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. దీంతో పారితోషకం అందుకున్న తారలకు నోటీసులు ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. అయితే తాజాగా.. క్యాసినో నిర్వహిస్తూ కోట్ల రూపాయల హవాలాకు పాల్పడుతున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్‌ స్పందించాడు.

క్యాసినో విషయంలోనే ఈడీ అధికారులు సోదాలు చేసినట్టు మీడియాతో చెప్పాడు. మనదేశంలోని గోవాలో క్యాసినో లీగల్‌ అని ప్రవీణ్‌ చెప్పుకొచ్చాడు. దీంతోపాటు నేపాల్, ఇండోనేషియాలో క్యాసినో లీగల్‌ అని తెలిపాడు. తాను చేసింది లీగల్‌ వ్యాపారమేనని అన్నాడు. తానొక సామాన్య వ్యక్తినని ప్రవీణ్‌ వ్యాఖ్యానించాడు. ఈడీ అధికారులకు కొన్ని సందేహాలు ఉన్నాయని.. అందుకే వాళ్లు వివరణ అడిగారని చెప్పాడు. వాళ్లు కొన్ని ప్రశ్నలు వేస్తే సమాధానాలు చెప్పానని అన్నాడు. వారికి ఏమేం వివరాలు కావాలో చెప్తానని ప్రవీణ్‌ మీడియాతో వెల్లడించాడు. సోమవారం మరోసారి విచారణకు రమ్మన్నారని, హాజరవుతానని పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version