మంత్రి దామోదర రాజనరసింహకు చేదు అనుభవం ఎదురైంది. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో మంత్రి దామోదరను కొందరు మహిళలు బూతులు తిట్టారు.గురువారం ఆందోల్ నియోజకవర్గంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా అక్కడకు వచ్చిన మహిళలు సహనం కోల్పొయినట్లు తెలిసింది.
కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా సన్న బియ్యం ఇస్తే, రేషన్ కార్డులు లేని తాము ఏమైపోవాలని..ఇచ్చిన మాట ప్రతిసారీ తప్పుతున్నారని మహిళల ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళలు తిడుతుంటే వీడియోలు తీయొద్దని పోలీసులకు తెలిపిన మంత్రి చెప్పినట్లు సమాచారం.స్థానికులు వీడియోలు తీయకుండా పోలీసులు, నాయకులు అష్టకష్టాలు పడినట్లు తెలిసింది.
సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహను బూతులు తిట్టిన మహిళలు
ఆందోల్ నియోజకవర్గంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో మహిళల బూతుపురాణం
కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా సన్న బియ్యం ఇస్తే, రేషన్ కార్డులు లేని తాము ఏమైపోవాలని.. ఇచ్చిన మాట ప్రతిసారీ తప్పుతున్నారని… pic.twitter.com/tkisvLAha8
— Telugu Scribe (@TeluguScribe) April 4, 2025