త్వరలోనే ఆ జిల్లా పేరు మార్పు : తెలంగాణ మంత్రి కీలక వ్యాఖ్యలు

-

వరంగల్ : 21న సీఎం కేసీఆర్ వరంగల్ టూర్ పై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. 21న ఉదయం 10:30 కు సెంట్రల్ జైలు స్థలంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి సీఎం భూమి పూజ చేస్తారని.. కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని ఆయన పేర్కొన్నారు. అనంతరం వరంగల్ అర్బన్ జిల్లా నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారని.. ఆ తర్వాత కడియం శ్రీహరి ఇంట్లో మధ్యాహ్న బోజనం అనంతరం యాదాద్రికి బయలుదేరుతారని పేర్కొన్నారు. వరంగల్ రూరల్ జిల్లా పేరును హన్మకొండ గా మార్చే అవకాశం ఉందని ఎర్రబెల్లి పేర్కొన్నారు.
సెంట్రల్ జైల్ స్థలంలో 30 అంతస్థుల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని.. ప్రస్తుతం కెనడాలో మాత్రమే 24 అంతస్తుల ప్రభుత్వ ఆస్పత్రి అందుబాటులో ఉందన్నారు.

వరంగల్ లో నిర్మించే 30 అంతస్తుల ఆస్పత్రి ప్రపంచంలోనే అతిపెద్దదని.. ఆస్పత్రులు వస్తే బీజేపీ నేతలను నష్టం ఏంటి..? అని ప్రశ్నించారు. కాగా పీవీ పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ‌కూడా తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. హుజూరాబాద్ ను జిల్లా చేసి పీవీ పేరు పెడుతారని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. వరంగల్ పర్యటనలో సిఎం కెసిఆర్ దీనిపై మరెలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version