ప్రధాని మోదీపై టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు యుద్ధం ప్రకటించారు. చేనేతపై విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని మోదీకి లక్ష ఉత్తరాలు రాయాలని పిలుపునిచ్చారు. తాజాగా కేటీఆర్ ఉద్యమానికి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి సపోర్ట్ ఇచ్చారు. మంత్రి ఎర్రబెల్లి కూడా చేనేతపై 5 శాతం జీఎస్టీ రద్దు చేయాలని కోరుతూ ప్రధాని మోదీకి పోస్టు కార్డు రాశారు. మంత్రి తన స్వహస్తాలతో రాసిన పోస్టు కార్డును ఈ రోజు పోస్టు చేశారు.
ఓ వైపు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేనేతలకు ప్రోత్సాహకాలు ఇస్తూ, వారిని ఆదుకుంటుంటే మరోవైపు కేంద్రం వారి నడ్డి విరిచేలా చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ విధించడం అన్యాయమని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. రాష్ట్రంలో నేతన్నలకు చేయూత, బీమా వంటి వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తుంటే, కేంద్రం చేనేత కార్మికులపై కక్ష కట్టిందని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చేనేతలపై విధించిన జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు.
చేనేత మీద కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ వెంటనే తొలగించాలని మంత్రి శ్రీ @KTRTRS గారి పిలుపు మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పోస్ట్ కార్డ్ రాయడం జరిగింది.#RollbackHandloomGST pic.twitter.com/QUWO5abp0w
— Errabelli DayakarRao (@DayakarRao2019) October 24, 2022