స్వరాష్ట్రంలోనే కులవృత్తులకు గౌరవం : మంత్రి ఎర్రబెల్లి

-

నేతన్నలకు ఉపాధి కల్పించి, గౌరవంగా బతికేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో పద్మశాలి కల్యాణ మండప నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో స్వరాష్ట్రం సాధించి.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కులవృత్తులకు గౌరవం దక్కిందన్నారు.

సమైక్య రాష్ట్రంలో పాలకులు కులవృత్తులకు ఏమైనా న్యాయం చేశారా? అని ప్రశ్నించారు. అలాగే పద్మశాలి కుటుంబాల ఉపాధి కోసం బతుకమ్మ చీరలను నేసే బాధ్యత కల్పించారన్నారు. మన ప్రాంతంలో వలస జీవులుగా మారుతున్న నేతన్నలను తిరిగి రాష్ట్రానికి రప్పిస్తున్న ఘనత బీఆర్‌ఎస్‌దేనన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మెగా టెక్స్‌టైల్‌ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, కొడకండ్లలో వచ్చే నెల అక్టోబర్‌ 6న మినీ టెక్స్‌టైల్‌ పార్కుకు శంకుస్థాపన చేయబోతున్నామన్నారు. పద్మశాలీ బిడ్డ, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నల్ల నరసింహులు చేసిన ఉద్యమాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు.

అంతే కాకా, శనివారం మండలకేంద్రంలో 10 కోట్ల రూపాయలతో ఆరు లైన్ల రహదారి విస్తరణ పనులకు, మూడు కోట్లతో సెంట్రల్ లైటింగ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తదుపరి స్వర్ణ భారతి మండల సమాఖ్య ఆధ్వర్యంలో రూరల్ మార్ట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రజా సంక్షేమ పథకాల పుట్టినిల్లు తెలంగాణ రాష్ట్రం అని కొనియాడారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పనులు ఏ ప్రభుత్వం చేయలేదనేది జగమెరిగిన సత్యం అని వ్యాఖ్యానించారు. తము చేపడుతున్న సంక్షేమం పట్ల ప్రచారం అవసరం లేదని ప్రజాసేవే ముఖ్యమని స్పష్టం చేశారు. కేసీఆర్ సాగు నీరు, త్రాగు నీరు, కరెంట్, రైతు బంధు, దళిత బంధు, డబుల్ బెడ్ రూములు, కళ్యాణ లక్ష్మీ, సబ్సిడీ ఎరువులు, మన ఊరు మన బడి వంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అమలు చేయడం గర్వకారణం అన్నారు. తెలంగాణ రాష్ట్ర పథకాలను చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకుంటున్నాయి అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version