కక్ష సాధింపులకు పాల్పడాల్సిన అవసరం లేదు : సజ్జల

-

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. లక్ష మంది గోబెల్స్‌ కలిస్తే ఒక చంద్రబాబని కామెంట్‌ చేశారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఇష్టానుసారం దోచుకున్నారని విమర్శించారు. ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన సజ్జల.. 4 కేసుల్లో చంద్రబాబు అండ్ టీంపై పూర్తి ఆధారాలు ఉన్నాయని వెల్లడించారాయన. ఆధారాలను సీఐడీ కోర్టు ముందు ఉంచిదని..ఇందులో రాజకీయ కక్షకు అవకాశం లేదని సజ్జల స్పష్టం చేశారు. స్కిల్ స్కాం కేసులో పూర్తి ఆధారాలతోనే సీఐడీ చంద్రబాబును కోర్టు ముందు ప్రవేశ పెట్టిందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ 20 రోజుల్లో లోకేశ్‌ ముఠా నానా యాగీ చేసిందన్నారు. ప్రజలకు సంబంధించిన సొమ్ము దోపిడీకి గురైందని సజ్జల వివరించారు. సాక్ష్యాధారాలతో దొరికితే కోర్టు రిమాండ్‌కు పంపిందని గుర్తు చేసారు. జరిగిన స్కామ్ పైన వీరంతా మాట్లాడటం లేదన్నారు.

నిన్న సజ్జల జగన్ అది భేటీ పై స్పందిస్తూ, ఆదానీ ముఖ్యమంత్రి జగన్ ను కలవటంలో రహస్యం లేదన్నారు. పెట్టుబడుల అంశం పైన చర్చించేందుకే సీఎం నివాసానికి వచ్చారని చెప్పారు. టీడీపీ అంటే తోడు దొంగల పార్టీ. ముఠా నాయకుడు చంద్రబాబును కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని సజ్జల వ్యాఖ్యానించారు. ఈ కేసుల్లో పూర్తి ఆధారాలు కోర్టుకు సమర్పిస్తుందని వివరించారు. ఈ నాలుగు కేసుల్లోనూ కిలారి రాజేశ్ కీలకంగా ఉన్నారని వెల్లడించారు. చంద్రబాబు పీఏగా పని చేసే వ్యక్తి సచివాలయంలో ఉద్యోగిగా ఉంటూ అకస్మికంగా అమెరికా ఎలా వెళ్లారని ప్రశ్నించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version