కేసీఆర్ నాయ‌క‌త్వంలో ఆరోగ్య తెలంగాణ అభివృద్ధి చెందుతుంది : హరీశ్‌ రావు

-

ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలో ఆరోగ్య తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు. అయితే.. మాతా శిశువుల సంర‌క్ష‌ణ కోసం తెలంగాణ ప్ర‌భుత్వం చేస్తున్న కృషిని ప్ర‌పంచ సంస్థ‌లు గుర్తించ‌డం తెలంగాణ‌కే గ‌ర్వ‌కార‌ణంగా ఉంద‌ని మంత్రి హ‌రీశ్‌రావు ట్వీట్ చేశారు. అందుకు ఇది ఒక నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు మంత్రి హ‌రీశ్‌రావు . తెలంగాణ ప్ర‌భుత్వంపై యునిసెఫ్ ఇండియా ప్ర‌శంస‌లు కురిపించింది. మాతా శిశువుల సంర‌క్ష‌ణ కోసం తెలంగాణ స‌ర్కార్ చేస్తున్న కృషి అద్భుత‌మ‌ని కొనియాడింది. సుర‌క్షిత డెలివ‌రీల కోసం సిబ్బందికి మిడ్ వైఫ‌రీ కోర్సులో శిక్ష‌ణ ఇస్తున్న తీరును యునిసెఫ్ ఇండియా మెచ్చుకున్న‌ది.

ఈ నేప‌థ్యంలో యునిసెఫ్ ఇండియా త‌న ట్విట్ట‌ర్‌లో ఇవాళ ఓ పోస్టు చేసింది. హైద‌రాబాద్‌లోని ఓ ఏరియా ఆస్ప‌త్రిలో మిడ్ వైవ్స్ ద్వారా పురుడు పోసుకున్న ఓ శిశువు ఫోటోను యునిసెఫ్ ఇండియా త‌న ట్విట్టర్‌ పోస్టులో జ‌త చేసింది. తెలంగాణ‌లో మాతాశిశు సంర‌క్ష‌ణ భేష్‌గా ఉంద‌ని యునిసెఫ్ పేర్కొన్న‌ది. మిడ్ వైఫ‌రీలో తెలంగాణ ప్ర‌భుత్వం దేశానికే దిక్సూచిగా నిలిచిన‌ట్లు యునిసెఫ్ త‌న ట్వీట్‌లో వెల్ల‌డించింది. మెట‌ర్నిటీ కేర్ అంశంలో తెలంగాణ స‌ర్కార్ గౌర‌వ‌ప్ర‌ద‌మైన రీతిలో ప‌నిచేస్తున్న‌ట్లు యునిసెఫ్ పేర్కొన్న‌ది. పురుడు స‌మ‌యంలో త‌ల్లుల‌కు ఎటువంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా, పాజిటివ్ బ‌ర్త్ ఎక్స్‌పీరియ‌న్స్ క‌లిగే రీతిలో మిడ్‌వైవ్స్‌కు శిక్ష‌ణ ఇస్తున్న తీరును యునిసెఫ్ ప్ర‌శ్నించింది. ఫ‌ర్ ఎవ‌ర్నీ చైల్డ్‌, ఎ హెల్తీ స్టార్ట్ అన్న హ్యాష్‌ట్యాగ్‌ను యునిసెఫ్ పోస్టు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version