గవర్నమెంట్ పథకాలు తీసుకుంటూ బీజేపీలో ఉండటం ఏంటి : బాజిరెడ్డి

-

ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిన్న నిజామాబాద్ లో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో బీజేపీకి చెందిన వ్యక్తి చెక్కును ఆపేశానన్నారు. ఆ వ్యక్తి తన దగ్గరికి వచ్చి చెక్ రాలేదని అడిగాడని.. ఇంట్లో రెండు ఫించన్లు ఇస్తున్నా కళ్యాణలక్ష్మి చెక్కు ఎందుకు అన్నానని చెప్పాడు. ఇంకా బీజేపీలో ఎందుకు ఉన్నావంటూ అడిగానన్నారు బాజిరెడ్డి. గవర్నమెంట్ పథకాలు తీసుకుంటూ బీజేపీలో ఉండటం ఏంటని అన్నారు. ఇదిలా ఉంటే.. సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీలో వికారాబాద్ జిల్లా దోమ మండల జడ్పీటీసీ నాగిరెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు తీసుకునేందుకు వెళ్ళిన పెంటారెడ్డి అనే బాధితుడిపై దుర్భాషలాడాడు. నీది ఏ పార్టీ, ఎవరికి ఓట్లు వేశావు, చెక్కు లేదు ఏం లేదంటూ ఇంట్లో నుండి గెంటేశాడు. దోమ మండలం గూడూరుకు చెందిన పెంటారెడ్డి అనే రైతు గొంతు క్యాన్సర్‭తో బాధపడుతున్నాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న పెంటారెడ్డి ఎకరం పొలం అమ్మి వైద్యం చేయించుకున్నాడు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొంత ఆర్థిక సహాయం అందుతుందని పరిగి ఎమ్మెల్యేకు ధరఖాస్తు చేసుకోగా రూ.60 వేల ఆర్థిక సహాయం మంజూరైంది.

ఈ క్రమంలో దోమ మండల జడ్పీటీసీ నాగిరెడ్డి పరిగిలోని తన నివాసంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశాడు. పెంటా రెడ్డి కూడా తన చెక్కు తీసుకునేందుకు తన కొడుకుతో కలిసి నాగిరెడ్డి ఇంటికి వెళ్ళగా.. అతడు బాధితుడితో దురుసుగా ప్రవర్తించాడు. తమకు చెక్కు ఇవ్వకుండానే ఇంట్లో నుండి గెంటేశాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version