తెలంగాణ మంత్రి హరీష్ రావు తాజాగా వచ్చే ఎన్నికల గురించి తనదైన శైలిలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. హరీష్ రావు మాట్లాడుతూ బీజేపీ ఎన్నికలో ఓడిపోతుందని భయంతోనే జమిలి ఎన్నికలను తెరపైకి తీసుకు వచ్చినట్లు చెప్పారు. ఎన్నికలలో గెలవాలన్నా రాజ్యాధికారం దక్కాలన్నా అన్నిటికంటే ముఖ్యంగా కావలసింది ప్రజల విశ్వాసం మనపై ఉండడమే అంటూ కీలకమైన విషయాన్ని తెలియచేశారు హరీష్ రావు. ప్రజల నమ్మకాన్ని ఎప్పుడైతే ఒక రాజకీయ పార్టీ లేదా రాజకీయ నాయకుడు గెలుచుకుంటాడో వారిదే విజయం అంటూ హరీష్ రావు ఖరాఖండీగా చెప్పేశారు హరీష్ రావు. ఇక తెలంగాణాలో అధికారంలో ఉన్న BRS దే మళ్ళీ అధికారం అంటూ కుండబద్దలు కొట్టారు హరీష్ రావు. వరుసగా మూడవ సారి కేసీఆర్ ను ప్రజలు ముఖ్యమంత్రిని చేయడం పక్కా అంటూ చాలా నమ్మకంతో చెప్పారు హరీష్ రావు.
మరి హరీష్ రావు చెప్పినట్లు జరుగుతుందా ? కాంగ్రెస్ ? బీజేపీ లను దాటుకుని ప్రజలు BRS కు ఓటేస్తారా అన్నది తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.