యాసంగిలో ఒక గింజ వరి కొనుగోలు చేసే పరిస్థితి లేదు : జగదీష్ రెడ్డి

-

యాదాద్రి భువనగిరి జిల్లా : భువనగిరి లో తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి.. ధాన్యం కొనుగోలు అంశం పై షాకింగ్ కామెంట్స్ చేశారు. యాసంగి లో వరి సాగుకి బదులు ప్రత్యామ్నాయ పంటసాగు వరి ధాన్యం కొనుగోలు పై అవగాహన సదస్సుకు ముఖ్య అతిధిగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి, విప్ గొంగిడి సునీత,జిల్లా పరిషత్తు చైర్మన్ సందీప్ రెడ్డి,డీసీసీబీ చైర్మన్ మహేందర్ రెడ్డి ,జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా లో ధాన్యం కొనుగోలుకు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ యాసంగి లో ఒక గింజ వరి కొనుగోలు చేసే పరిస్థితి లేదని.. కాబట్టి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ఆదేశించామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి జగదీశ్ రెడ్డి.

ఇతర రాష్ట్రాల వారు కూడా వరిని పండిస్తున్నారని.. కాబట్టి ఆహార నిర్వహణ అధికం గా ఉండటం వల్ల వరి కొనుగోలు చేయమని కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గారి చొర వ తో వచ్చే యాసంగి కొనుగోలు కూడా ఈ సంవత్సరం కొనుగోలు చేస్తున్నామని కేంద్రం చెప్పిందని పేర్కొన్నారు.

మన దేశంలో అవసరాలకు తగ్గట్టుగా నూనె నూనె గింజల పంటలు లేనందున రైతులకు నూనెగింజల పంటలు వేసుకోవాలి ఆదేశాలు ఇచ్చామని స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ పంటల కు ఏ రక మైన విత్తనాలు కొరత లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విత్తనాల సరఫరా చేస్తుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version