గతంలో లేనంతగా ప్రజలు ఓటేసి టీఆర్‌ఎస్‌ను గెలిపించారు : జగదీష్‌రెడ్డి

-

గత రెండు నెలలుగా ఎక్కడ చూసినా మునుగోడు ఉప ఎన్నికపైనే చర్చ జరిగింది. అయితే.. ఎట్టకేలకు ఈ నెల 3న మునుగోడు మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్‌ జరుగగా.. నేడు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే.. ఇప్పటికే 14 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగగా.. 2,3,4 రౌండ్లు మినహా అన్ని రౌండ్లలో టీఆర్ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ఆధిక్యం కనబరిచారు. అయితే.. ప్రస్తుతం 15వ రౌండ్‌ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అయితే.. దాదాపు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం ఖరారైంది. మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘన విజయాన్ని అందుకోనున్న సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు ఆనందం వ్యక్తపరుస్తున్నాయి. ఇక, ఉప ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కేసీఆర్తోనే ఉన్నారని మరోసారి రుజువైందన్నారు.

ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఛాలెంజ్‌పై మీడియా ప్రశ్నించగా.. మంత్రి జగదీష్ రెడ్డి..ఈ జిల్లాలో వాళ్ల అన్నదమ్ముల మాటలను ప్రజలు ఎవ్వరూ నమ్మరన్నారు. అలాంటి ఛాలెంజ్లు చాలా చేసే ఉంటారని, ఎన్నికల్లో ఇచ్చిన ఏ మాటను వారు అమలు చేయలేదన్నారు. వాళ్లు గురించి నేను పెద్దగా పట్టించుకోనని, టీఆర్ఎస్‌ను ఓడించడానికి స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్, కేంద్రమంత్రులు, కీలక నేతలు వచ్చారన్నారు. కానీ, వారు కేసీఆర్‌ను ఓడించలేకపోయారన్నారు. బీజేపీ నేతలు ఎన్ని అక్రమాలు చేసినా.. అవినీతి చేసినా.. ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారు. కేసీఆర్ గారు మీరు ఢిల్లీ వెళ్లండి.. దేశరాజకీయాల్లోకి వెళ్లండి అని ప్రజలు చెప్పకనే చెప్పారు. ఇక, ఇక్కడి నుంచే కేసీఆర్ గారు ఢిల్లీపైన ధర్మయుద్ధం ప్రారంభిస్తారు. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అందరి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version