SLBC లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 144 గంటలు గా సాగుతుంది ఈ రెస్క్యూ ఆపరేషన్. సిల్ట్, మట్టి నీ లోకో ట్రైన్ ద్వారా బయటకు తరలిస్తున్నారు. TMB మిషన్ ను ప్లాస్మా కట్టర్ తో కట్ చేస్తుంది రెస్క్యూ టీమ్. ప్రస్తుతం జీరో పాయింట్ వద్దకు చేరుకున్నాయిరెస్క్యూ టీమ్స్. ఆ మట్టిలో కార్మికుల ఆనవాళ్ల కోసం రాడార్ లతో సెర్చ్ చేస్తున్నారు. రేడియో తరంగాలతో శిధిలాలను జల్లెడ పడుతుంది జీపీఆర్ యంత్రం. కన్వెర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు కూడా సాగుతూనే ఉన్నాయి.
అయితే ఈ SLBC ఘటన పై తాజాగా మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన కామెంట్స్ చేశారు. అద్భుతం జరిగితే తప్ప టన్నెల్‌లో చిక్కుకున్న 8మంది బతికే ఛాన్స్ లేదు అని పేర్కొన్నారు. అయితే బీఆర్ఎస్ ప్రకృతి విపత్తుని రాజకీయంగా వాడుకుంటుందని, శవాల మీద పేలాలు ఎరుకుంటున్నారంటూ కామెంట్స్ చేశారు మంత్రి జూపల్లి.