2024లో 171 బిలియన్ UPI లావాదేవీలు జరిగాయి : రాజ్ నాథ్ సింగ్

-

భారతదేశం UPI లావాదేవీలలో అగ్రగామిగా ఉంది అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. 2024లో, భారతదేశంలో మాత్రమే 171 బిలియన్ UPI లావాదేవీలు జరిగాయి. మొత్తం లావాదేవీల విలువ 2.45 లక్షల కోట్ల రూపాయలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్‌లో మనం ముందంజ వేయాలి. హార్డ్‌వేర్ నుండి సాఫ్ట్‌వేర్‌కు సైబర్ నేరాలు పెరుగుతున్నది.ఇక్కడికి వెళ్లాలంటే, మనకు కొత్త విధానం అవసరం. ఈ దృక్కోణం నుండి కూడా, సైన్స్ మరియు టెక్నాలజీలో ముందుకు సాగడం ముఖ్యం.

రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు సైన్స్ విద్యార్థిగా మరియు సైన్స్ ప్రొఫెసర్‌గా పనిచేసాను. యువతి యువకులు శాస్తవ్రేత్తలను ఆదర్శంగా తీసుకోవాలి. గ్లోబల్ లీడర్ షిప్ లో యువతదే కీలక పాత్ర. సైన్స్ టెక్నాలజీలో వచ్చే మార్పుల పట్ల విద్యార్ధులు అవగాహన కలిగి ఉండాలి. రక్షణ శాఖ చారిత్రాత్మక విజయాల్లో కేంద్రం విశేష పాత్ర పోషిస్తుంది. ఈ శాఖకు గత కొద్ది సంవత్సరాలుగా మంత్రిగా ఉండటం నా అదృష్టం. మానవుని మేధ సంపత్తు చాలా గొప్పది. సైన్స్ అండ్ టెక్నాలజీ లో వస్తున్న మార్పులకు అనుగుణంగా రక్షణ శాఖలో మార్పులు ఉంటున్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ లో కొత్త ఒరవడిని భారతదేశం సృష్టిస్తోంది. పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అన్ని రంగాల్లో భారత దేశం అగ్రగామిగా ఉంది అని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news