“ఎవరొస్తారో రండి”… వైకాపా సవాల్ ఈ రేంజ్ లో ఉంది!

-

బాబు అన్నీ తెలుసు కానీ.. ఏమీ తెలియనట్లు నటిస్తుంటారని, ఆ విషయం పక్కనున్నవారు ఎవరూ చెప్పే సాసహం చేయరని.. ఈయన కూడా తెలియనట్లే నటిస్తుంటారని అసెంబ్లీ సాక్షిగా ధర్మాన ప్రసాదరావు లాంటి వారు క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సంగతి కాసేపు పక్కనపెడితే… తన పాలనలో వ్యవసాయంపై బాబు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు అనేది బాబుకు నిజంగానే తెలియదా? తెలియనట్లు నటిస్తున్నారా? ప్రస్తుతం సవాళ్లు విసురుతున్నారు.. వైకాపా నేతలు రమ్మంటున్నారు!

తాను ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లు వ్యవసాయం విషయంలో బాబు పద్దతి ఎలా ఉండేదో బాబుకు మాత్రం తెలియదా? “వ్యవసాయం దండగ” అన్న మాటలు బాబు మరిచినట్లు నటించినా.. ప్రజలకు గుర్తులేదా? రుణమాఫీ విషయంలో బాబు వంచనను ప్రజలు మరిచిపోగలరా? అయినా కూడా ఆన్ లైన్ లో సవాళ్లు విసురుతున్నారు చంద్రబాబు. వైకాపా నేతలు అందుకు తగ్గట్లుగానే “ఎవరొస్తారో రండి” అని దిమ్మతిరిగే ప్రతిసవాల్ విసురుతున్నారు.

వ్యవసాయాభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో చర్చిద్దాం రండి అని చంద్రబాబు వైకాపా నేతలకు సవాల్ విసిరారు. తన హయాంలో వ్యవసాయాభివృద్ధి అత్యున్నతంగా ఉంది అన్నది ఆయన వాదన! ఈ విషయాలపై తాజాగా స్పందించారు ఏపీ వ్యవసాయశాఖా మంత్రి కన్నబాబు. “చంద్రబాబు సవాల్ ను స్వీకరిస్తున్నాం.. అయిదేళ్ల టీడీపీ పాలనలో రైతులకు ఏమి చేశారు? ఏడాదిన్నర పాలనలో వైకాపా ఏమి చేసింది? అనే విషయాలపై చర్చిద్దాం రండి… ఎవరొస్తారో రండి.. మేము సిద్ధం” అని సీరియస్ సవాల్ విసిరారు కన్నబాబు!

మరి ఈ సవాల్ కు చంద్రబాబు స్పందిస్తారా? లేక కన్నబాబు మరీ అంత సీరియస్ గా పిలుస్తారని ఊహించలేదని భావిస్తూ.. సైలంట్ అయిపోతారా? అన్నది వేచి చూడాలి!! ఈ విషయాలపై స్పందించిన నెటిజన్లు… బాబు సవాళ్ల గురించి తెలియందేముందని కొందరు అంటుంటే… బాబు మారారో లేదో ఈ దెబ్బతో తేలిపోతుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరి బాబు మారారా లేక అలానే ఉన్నారా?

-CH Raja

Read more RELATED
Recommended to you

Exit mobile version