రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆగడం లేదు. తాజాగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈ నెల 28న విద్యార్థినులకు పెట్టిన జీరా రైస్‌లో పురుగులు రావడంతో అది తిన్న 6వ తరగతి విద్యార్థిని అలావత్ సంజనకు వాంతులు అయ్యాయి.
దీంతో అస్వస్థతకు గురైన సంజనను ప్రిన్సిపాల్,వార్డెన్ ఇంటికి పంపించారు. ఇంటికి వెళ్ళిన సంజనకు అస్వస్థత తగ్గకపోవడంతో ఈ నెల 29న ప్రైవేట్ ఆసుపత్రిలో తన తండ్రి రవి చేర్పించారు. అనంతరం ప్రిన్సిపాల్‌కు కాల్ చేయగా ఆయన స్పందించలేదు. ఇదే ఘటనలో తనతో పాటు మరో 10 మందికి వాంతులు అయ్యాయని విద్యార్థిని సంజన వెల్లడించింది.