కేటీఆర్ కు రాజకీయ ఓనమాలు కూడా తెలియదు : మంత్రి కొమటిరెడ్డి

-

మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాట్ కామెంట్స్ చేసారు. కేసీఆర్ కొడుకు అనే అర్హత తప్ప కేటీఆర్ ఏ అర్హత లేదు.. కేటీఆర్ కేసీఆర్ తండ్రి చాటు కొడుకు అని అన్నారు. అలాగే కేటీఆర్ కు రాజకీయ ఓనమాలు కూడా తెలియదు. రేవంత్ రెడ్డి రైతు బిడ్డగా రాజకీయాల్లో అంచెలు అంచెలుగా సీయంగా ఎదిగారు. కేసీఆర్ మోకాలు ఎత్తులేనివాడే కేసీఆర్ ను ఓడించారు. కేసీఆర్ జ్జాపకాలు తెలంగాణలో ఎప్పుడో చెరిపేసారు.

అయితే రాహుల్, సోనియా పేర్లు ఎత్తే స్దాయి నీది కాదు కేటీఆర్ అని చెప్పిన మంత్రి.. ప్రభాకర్ రావు, శ్రవణ్ లు త్వరలో ఇండియాకు వస్తారు.. వాళ్లు వస్తే ఇంకెంత మంది జైల్ కు పోతారో చూడాలి. తెలంగాణ తాజా బడ్జెట్ చరిత్రలో నిలిచిపోతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలులో మాట తప్పము, మడమ తిప్పము. ఎస్సీ వర్గీకరణ, బీసీ లకు రిజర్వేషన్ల నిర్ణయం చారీత్రాత్మకం. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని మంత్రి కొమటిరెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version