BIG BREAKING : కౌశిక్‌రెడ్డికి హుజురాబాద్‌ నుంచి బీఆర్‌ఎస్‌ టికెట్‌.?

-

నేడు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ కరీంనగర్‌ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. అదే సమయంలో పరోక్షంగా ఈ సారి హుజురాబాద్‌ నుంచి బీఆర్‌ఎస్‌ తరుఫున పాడి కౌశిక్‌ రెడ్డిని రంగంలోకి దింపనున్నట్లు హింట్‌ ఇచ్చారు. సభలో మాట్లాడుతున్న క్రమంలో.. కౌశిక్‌రెడ్డి… ప్రజల్లోనే ఉండి.. గ్రామాల్లోనే తిరుగు.. అక్కడే పడుకో అంటూ వ్యాఖ్యానించారు మంత్రి. అయితే.. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి పోటీలోకి దిగిన గెల్లు శ్రీనివాస్‌ ఓటమిపాలైన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. బీఆర్‌ఎస్‌ జమ్మికుంట సభకు పూర్తి బాధ్యత తన భుజాలపై వేసుకొని ముందుండి నడిపించారు పాడి కౌశిక్‌ రెడ్డి.

ఈ నేపథ్యంలో కౌశిక్‌ రెడ్డికే ఈసారి బీఆర్‌ఎస్‌ బీ ఫాం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. స్థానిక ఎమ్మెల్సీతో వెళ్లాలో.. పార్టీ ఇన్​చార్జీతో నడవాలో తెలియక హుజూరాబాద్ బీఆర్ఎస్ క్యాడర్​లో గందరగోళం నెలకొంది. బై ఎలక్షన్స్ లో అధికార పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఈటల రాజేందర్​పై ఓడిపోయిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ నియోజవర్గం ఇన్ చార్జిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయనకు పార్టీలో ప్రయార్టీ తగ్గినట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు నెలల నుంచి పాడి కౌశిక్ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో దూకుడు పెంచడం, తన అనుచరులతో మీటింగులు నిర్వహిస్తుండడం గెల్లు శ్రీనివాస్​ను ఆత్మరక్షణలో పడేసింది. గెల్లుకు ఇన్ చార్జి బాధ్యతలు ఇచ్చినట్లే ఇచ్చి.. అధిష్టానం ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని ఎంకరేజ్ చేయడం పార్టీ శ్రేణుల్లోనూ చర్చనీయాంశంగా మారింది. తాజాగా మంత్రి, అధికార పార్టీ వర్కింగ్​ప్రెసిడెంట్ కేటీఆర్ హుజూరాబాద్​పర్యటన, బహిరంగ సభ ఏర్పాట్లను కౌశిక్‌రెడ్డి అంతా తానై చూసుకోవడం గెల్లు శ్రీనివాస్ అనుచరులకు మింగుడు పడడం లేదు. ఇరువర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version