రేవంత్‌ రెడ్డి కాదు.. రేటెంత రెడ్డి : మంత్రి కేటీఆర్‌

-

తెలంగాణలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా రేవంత్‌ రెడ్డిని టార్గెట్‌ చేసి మంత్రి కేటీఆర్‌ విమర్శలు గుప్పిస్తున్నారు. రేవంత్‌ రెడ్డి సైతం కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కామారెడ్డి మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. ఇవాళ ఏం జరుగుతోంది రాష్ట్రంలో… ఆనాడేమో ఓటుకు నోటు… నేడు సీటుకో రేటు అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ఇవాళ మీరు చూస్తున్నారు… కాంగ్రెస్ పార్టీలో చాలా లొల్లి జరిగింది… పైసలు ఎక్కువ ఉన్నవాళ్లకే టికెట్లు ఇస్తున్నారు అని కేటీఆర్ ఆరోపించారు.

టికెట్లు అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ నేతలే అంటున్నారు… జరుగుతున్న పరిణామాలతో మొన్న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, నిన్న మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి రాజీనామా చేసి నా సమక్షంలోనే బీఆర్ఎస్ లో చేరారు అని వెల్లడించారు.

ఇవాళ ఆయనను రేవంత్ రెడ్డి అనడంలేదు.. రేటెంత రెడ్డి అంటున్నారు… పాపం కాంగ్రెస్ పార్టీకి అలాంటి పరిస్థితి వచ్చింది అంటూ కేటీఆర్ వ్యంగ్యం ప్రదర్శించారు. మరో విషయం కూడా రాసిపెట్టుకోండి… ఎన్నికలైన మరునాడే గెలిచిన పదో పన్నెండు మందో ఎమ్మెల్యేలతో కలిసి ఇదే రేవంత్ రెడ్డి బీజేపీలోకి జంప్ చేయకపోతే నన్ను నిలదీయండి అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version