బాలానగర్‌ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

-

హైదరాబాద్: బాలానగర్‌ ఫ్లై ఓవర్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దీంతో బాలానగర్ డివిజిన్ నర్సాపూర్ చౌరస్తాలో ట్రాఫిక్ కష్టాలు తీరాయి. కూకట్ పల్లి, సికింద్రాబాద్, జీడిమెట్ల వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యేది. ఇప్పుడు ఈ ప్రాంతంలో కొత్త ఫ్లై ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. మంత్రి కేటీఆర్ ఈ ఫ్లై ఓవర్ బ్రిడ్జిని ప్రజలకు అంకితం చేశారు.

2017 ఆగస్టు 21న ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జికి మంత్రి కేటీఆరే శ్రీకారం చుట్టారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 385 కోట్లు కేటాయించారు. అప్పటి నుంచి నిర్మాణం చేపట్టిన ఈ బ్రిడ్జి ఇప్పటికి అందుబాటులోకి వచ్చింది. మొత్తం 1.13 కిలోమీటర్ల పొడవులో ఈ బ్రిడ్జి ఉంటుంది. 24 మీటర్ల వెడల్పు, 26 పిల్లర్లతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జికి బాబూ జగజ్జీవన్ రామ్‌గా నామకరణం చేశారు. ఇక నుంచి ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version