ప్రతిపక్షాల పేరు చెబితే సంక్షోభమే గుర్తొస్తుంది : కేటీఆర్‌

-

కేసీఆర్‌ అంటేనే సంక్షేమమని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. అదే ప్రతిపక్షాల పేరు చెబితే సంక్షోభమే గుర్తొస్తుందని విమర్శించారు. వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌. పేదవాళ్ల మొహాల్లో చిరునవ్వు.. కండ్లలో సంతోషాన్ని ప్రకటించే ప్రభుత్వం.. కేసీఆర్‌ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు.
విప్లవాత్మక పథకాలు ప్రవేశపెట్టాలంటే.. చారిత్రక కార్యక్రమాలు చేయాలంటే నాయకులకు తెగువ, తెగింపు ఉండాలని.. అల్లాటప్ప నాయకులతో విప్లవాత్మక పథకాలు రావని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం అనంతరం 76 ఏండ్లలో ఎవరూ పెట్టని విధంగా కేసీఆర్‌ నాయకత్వంలో దళితబంధు అనే విప్లవాత్మక పథకాన్ని పెట్టుకున్నామని అన్నారు.

అందులో భాగంగానే ఇవాళ వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో 1100 మందికి దళిత బంధు అందుతున్నదని తెలిపారు. బాబా సాహెబ్‌ ఆశయాలను ముఖ్యమంత్రి ముందుకు తీసుకెళ్లున్నారని అన్నారు. కుల రహిత సమాజం, వివక్ష లేని సమాజం ఉండాలంటే ఆర్థిక అసమానతలు తొలగిపోవాలనే ఆకాంక్షతో సీఎం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. కేసీఆర్‌ ప్రభుత్వానికి ప్రజలపై ఎంత ప్రేమ ఉందో ఆలోచన చేయాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు.

అంతే కాక, వ‌రంగ‌ల్‌లోనే కాదు ఏపీలోని భీమ‌వ‌రం, నెల్లూరుకు కూడా ఐటీ సంస్థ‌లు రావాలి అని కేటీఆర్ ఆకాంక్షించారు. అక్క‌డా ఐటీ సంస్థ‌ల‌ను పెట్టాల‌ని ఎన్నారైల‌ను కోరుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతాల్లో భవిష్యత్‌లో గొప్ప ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.ఈ మేరకు క్వాడ్రంట్‌ సాఫ్ట్‌వేర్ కంపెనీ య‌జ‌మానుల‌కు కేటీఆర్ సూచించారు. కావాలంటే జ‌గ‌నన్న‌కు చెప్పి నేను మీకు జాగా ఇప్పిస్తాను అని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇకపోతే బెంగ‌ళూరు ఐటీ రంగంలో 40 శాతం తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ వారే ఉన్నారని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్క‌డి నుంచి వ‌చ్చేందుకు తెలుగు ఐటీ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఉన్న‌చోటే యువ‌త‌కు ఉపాధి ద‌క్కాలి. కులం, మ‌తం పేరుతో కొట్టుకుచావ‌డం మానాలి అని ఐటీ మినిస్టర్ కేటీఆర్ అన్నారు. ఉపాధి కోసం వ‌ల‌స వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా ఎక్క‌డిక‌క్క‌డ పరిశ్ర‌మ‌లు పెట్టాల‌ని కేటీఆర్ ఆకాంక్షించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version