పసుపు పంట నాశనం చేసిందే మీ పార్టీ : ఎంపీ అర్వింద్‌

-

పసుపు బోర్డును ఎక్కడ ఏర్పాటు చేయాలో తమకు తెలుసునని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఇవాళ ఘట్ కేసర్ లో జరుగుతున్న రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. పసుపు బోర్డుపై రేవంత్ రెడ్డికి అవగాహన లేదన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు మంత్రిగా పనిచేయలేదని, ఆయన జీవితంలో మంత్రి కాలేరని ఎద్దేవా చేశారు. పసుపు బోర్డు కోసం రేవంత్ రెడ్డి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పసుపు పంటను నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అంటూ ధ్వజమెత్తారు. చెరుకును కనుమరుగు చేసింది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. కొడంగల్ లో తంతే మల్కాజ్ గిరిలో పడ్డ రేవంత్ తమకు చెప్పడమేమిటని ప్రశ్నించారు.

తెలంగాణ వీరుల పోరాటంతోనే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. రేవంత్‌రెడ్డి కొడంగల్‌‌లో ఓడిపోతేనే మల్కాజిగిరి నుంచి చివరి నిమిషంలో పోటీ చేశారు. సగం పార్లమెంట్‌ స్థానాలల్లో కాంగ్రెస్ అడ్రస్ లేదు.. కాంగ్రెస్‌కు ఇక అసెంబ్లీ 61 సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి. అదానీని పైకి తీసుకు వచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సోనియాగాంధీ కాదు స్కాంల గాంధీ. రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసు ఏమైందీ..? మంత్రి కేటీఆర్ మోదీని విమర్శిస్తే చూస్తు ఊరుకోం. కేంద్ర ప్రభుత్వం నిధుల వల్లే తెలంగాణ అభివృద్ధి చెందింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ రెండుసార్లు ప్రకటించిన మేనిఫెస్టోలోని ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ఈ సారి ప్రకటించే బీఆర్ఎస్ మేనిఫెస్టోను చించివేయాలి’’ అని ఎంపీ అరవింద్ పిలుపునిచ్చారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version