పొలిటికల్ టూరిస్టులు అంటూ నడ్డా, రాహుల్ లపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు

-

ఇటీవల తెలంగాణ పర్యటనకు జాతీయ నాయకులు వస్తున్న విషయం తెలిసిందే. నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తే.. నేడు ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ వచ్చారు. అయితే.. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ జాతీయ నాయకుల తెలంగాణ పర్యటనలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ, కాంగ్రెస్‌ల‌కు చెందిన నేత‌లపై శుక్ర‌వారం రాత్రి ట్విట్ట‌ర్ వేదిక‌గా టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సింగిల్ లైన్‌తో కూడిన ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్‌ చేశారు. పొలిటిక‌ల్ టూరిస్టులు వ‌స్తుంటారు, వెళుతుంటార‌న్న కేటీఆర్‌… కేసీఆర్ మాత్ర‌మే తెలంగాణ‌లో నిల‌బ‌డ‌తారంటూ ఆయ‌న పోస్ట్ చేశారు. గురువారం నాడు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పాద‌యాత్ర తొలి ద‌శ ముగింపు సంద‌ర్భంగా మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌కు న‌డ్డా హాజ‌ర‌య్యారు. తాజా శుక్ర‌వారం నాడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. వ‌రంగ‌ల్‌లో టీపీసీసీ ఏర్పాటు చేసిన రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ‌కు హాజ‌రైన రాహుల్‌… శ‌నివారం నాడు హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. న‌డ్దా, రాహుల్‌ల టూర్‌ల నేప‌థ్యంలో ఈ ట్వీట్ చేశారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version