తెలంగాణలో బీజేపీ రిమోట్ కంట్రోల్ పాలన నడుస్తోంది: రాహుల్ గాంధీ

-

నరేంద్రమోదీ మూడు నల్ల చట్టాలు తీసుకువచ్చినప్పుడు.. టీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడారని… టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని, వీరిద్దరి మధ్య ఒప్పందం ఉందని రాహుల్ గాంధీ విమర్శించారు. బీజేపీ తెలంగాణలో ప్రత్యక్షంగా పాలన చేయలేదని… అందుకే రిమోట్ కంట్రోల్ పాలన చేస్తుందని విమర్శించారు. బీజేపీకి తెలుసు ఎప్పుడూ కూడా పొత్తు, సంబంధం ఉండదని… కాంగ్రెస్ ప్రభుత్వ ఇక్కడ ఏర్పడుతుందని… అందుకే టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంత అవినీతి చేసినా… కేంద్ర ప్రభుత్వ ఈడీ, సీబీఐ ఇతర కేంద్ర సంస్థల ద్వారా విచారణ జరపడం లేదని ఆరోపించారు. ఈ సభ రైతులకు భరోసా ఇవ్వడానికి, వరంగల్ డిక్లరేషన్ ఇవ్వడానికి, కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా నిలబడుతుందని రాహుల్ గాంధీ అన్నారు. రాబోయే కాలంలో ఆదివాసీలకు సంబంధించి ఇదే విధంగా సభను నిర్వహిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. 10 శాతం రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని.. రైతులు, పేదల సర్కార్ ఏర్పాటు చేస్తామని రాహుల్ గాంధీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version