తొలి ప్రైవేటు రాకెట్‌ ప్రయోగం విజయవంతం.. స్కైరూట్ టీమ్‌కు మంత్రి కేటీఆర్‌ విషెస్‌

-

భారత్ అంతరిక్ష రంగంలో మరో మైలురాయి నమోదైంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ ప్రైవేట రాకెట్‌ను ఇస్రో శాస్త్తవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. ఇప్పటి వరకూ భారత్ కి సంబంధించిన ప్రయోగాలనే చేపట్టిన ఇస్రో.. పలు ప్రైవేటు ఉపగ్రహాలను నింగిలోకి పంపించినా రాకెట్ మాత్రం ఇస్రోనే తయారు చేసేది. కానీ ఈసారి రాకెట్ కూడా ప్రైవేటుదే కావడం విశేషం. అయితే.. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్.. స్కైరూట్ టీమ్‌కు హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు. హైద‌రాబాద్‌కు చెందిన సంస్థ కొత్త చ‌రిత్ర‌ను లిఖించినందుకు చాలా గ‌ర్వంగా ఉంద‌న్నారు కేటీఆర్. శ్రీహ‌రికోట‌లోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్ షార్‌ నుంచి శుక్రవారం ఉదయం 11.30 గంటలకు విక్రమ్‌-ఎస్‌ రాకెట్‌ నింగిలోకి వెళ్లింది.

హైదరాబాద్ కి చెందిన స్పేస్ స్టార్టప్ అయిన స్కైరూట్ ఏరోస్పేస్ ఈ రాకెట్‌ను రూపొందించింది. విక్రమ్‌ సారాభాయ్‌ పేరుమీద దీనికి విక్రమ్‌-ఎస్‌ అని నామరకణం చేశారు. దీని పొడవు 6 మీటర్లు కాగా, బరువు 545 కిలోలు. ఇది రెండు భారతీయ, ఒక విదేశీ పేలోడ్లను కక్షలోకి తీసుకెళ్లింది. వాటిలో భారత్, అమెరికా, సింగపూర్, ఇండోనేషియాకు చెందిన విద్యార్థులు అభివృద్ధి చేసిన 2.5 కిలోల పేలోడ్ అయిన ఫన్-శాట్‌, చెన్నైకి చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ స్పేస్ కిడ్జ్‌ ఉన్నాయి. ఈ మిషన్ ద్వారా దేశంలో అంతరిక్షంలోకి రాకెట్‌ను ప్రయోగించిన తొలి ప్రైవేట్ అంతరిక్ష సంస్థగా స్కైరూట్ అవతరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version