రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి దేశంలో మరెక్కడా లేదు : మంత్రి మల్లారెడ్డి

-

మేడ్చల్‌ జిల్లా కీసర మండలం భోగారం గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు, మహిళలు శుక్రవారం టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో వారికి గులాబీ కండువాలు గప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ చేపడుతున్న సంక్షేమ పథకాలు మరెక్కడా అమలు కావడం లేదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్‌ హయాంలో గత ఎనిమిది సంవత్సరాల నుంచి రాష్ట్రంలో కోట్లాది రూపాయలతో అనేక రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు మంత్రి మల్లారెడ్డి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి దేశంలో మరెక్కడా జరుగడం లేదన్నారు.

యావత్ దేశ ప్రజలు కేసీఆర్‌ను దేశానికి నాయకత్వం వహించాలని కోరుతున్నారన్నారు మంత్రి మల్లారెడ్డి. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి ఇటు కాంగ్రెస్‌, బీజేపీలకు నిద్ర పట్టడం లేదని మంత్రి ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీలకు భవిష్యత్‌ ఉండదని తెలిపారు మంత్రి మల్లారెడ్డి. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ బెస్త వెంకటేశ్‌, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిర, మండల పార్టీ అధ్యక్షులు జలాల్‌పురం సుధాకర్‌రెడ్డి, భోగారం కో-ఆప్షన్‌ సభ్యుడు డబ్బి నర్సింహరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version