ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో పురోగతి సాధించిందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఇక జనసేన పార్టీ నేత, మంత్రి నాదేండ్ల మనోహర్ తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు.అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తన సొంత నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టారు. ఎప్పటికప్పుడు ప్రజలను తమ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా గుంటూరు జిల్లాలోని తెనాలిలో ఆయన పర్యటించారు.పేరంటాలమ్మ ఆలయంలో పూజలు చేసి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.వార్డుల్లో కలియ తిరుగుతూ స్వయంగా ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే సమస్యలు పరిష్కరిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ రెడీగా ఉంటుందని మంత్రి తెలిపారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. దీనిలో భాగంగానే తన నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టినట్లు వెల్లడించారు.