తెలంగాణ విద్యార్థులకు అలర్ఠ్…రేపు స్కూళ్లకు సెలవు ఉండనుందట. తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్ అందింది. షబ్ ఎ మిరాజ్ సందర్భంగా రేపు అంటే మంగళవారం సెలవు ఉండనుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేగా పేర్కొనగా మైనార్టీ విద్యాసంస్థలు సెలవు ప్రకటించనున్నాయి.
మిగతావి తమ స్వీయ నిర్ణయం ప్రకారం తరగతుల నిర్వహణ లేదా సెలవును ఇవ్వవచ్చు. షబ్ ఎ మిరాజ్ అంటే ముస్లింల పండుగ. ఈ రోజు వారు జాగారం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈ వేడుక జరుపుకుంటారు.