జనసేన కార్యకర్తలకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..!

-

పదవుల కోసం జనసేన  కార్యకర్తలు టైమ్ వేస్ట్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, ఇతర పార్టీ నేతలతో రహస్యంగా లేఖలు, పరిచయం పెంచుకుంటున్నారని జరుగుతున్న ప్రచారంపై మంత్రి నాదెండ్ల మనోహర్  మండిపడ్డారు. కార్యకర్తల సమావేశంలో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జనసేన కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జనసేన పార్టీ సిద్ధాంతాలకు అందరూ కట్టుబడి ఉండాలని సూచించారు. ఎలాంటి టైవ్ వేస్ట్ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని హెచ్చరించారు. కొంతమంది మూర్ఖులు కావాలనే పవన్ కల్యాణ్ పై, జనసేన పై దుష్ప్రచారం చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పదవులు ఉన్నా, లేక పోయినా, ప్రతిపక్షంలో ఉన్నా కార్యకర్తలకు తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు. 928 మంది కార్యకర్తలకు బీమా పథకం ద్వారా పవన్ కల్యాణ్ చేతుల మీదుగా రూ.24 కోట్లు అందించారని గుర్తు చేశారు. ఇలా ఎవరైనా ఇవ్వగలిగారా అని ప్రశ్నించారు. ఆపదలో ఉన్న కార్యకర్తలకు జనసైనికులందరూ కలిసి సాయం చేసిన రోజులు కూడా ఉన్నాయన్నారు. పవన్ చేసిన సాయాన్ని మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. పదవుల కోసం కాదని, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఆలోచనతో జనసైనికులు ఇప్పటి వరకూ పని చేశారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version