టిడ్కో కాలనీలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశాం అని మంత్రి నారాయణ తెలిపారు. అలాగే 63 కాలనీల్లో కూడా ఆలయాలను నిర్మిస్తాం. ఎన్నో దేశాలు తిరిగి కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండేలా టిడ్కో ఇళ్ల ను తీసుకువచ్చాం. టిడిపి హయాంలో కట్టిన ఇళ్లను కూడా లబ్ధిదారులకు వైసిపి ప్రభుత్వం ఇవ్వలేదు. 2 లక్షల 30 వేల ఇళ్లను త్వరలోనే పూర్తి చేసి ఇస్తాం అన్నారు.
కానీ ఖజానా ను జగన్ ఖాళీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులను కూడా జగన్ మళ్లించారు 2019 లో 5 వేల 350 కోట్ల మేర నిధులను ఆసియా అభివృద్ధి బ్యాంక్ నిధులను కేటాయిస్తే దానికి మాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు. ఇప్పుడు మళ్లీ కేంద్రంతో చర్చించి ఆ నిధులను తీసుకు వస్తాం. అమృత్ పథకం కింద తాగునీటికి నిధులు ఇస్తాం అని మంత్రి నారాయణ స్పష్టం చేసారు.