BIG BREAKING : రాజాసింగ్ సింగ్ రిమాండ్ రద్దు చేసిన నాంపల్లి కోర్టు

-

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వ‌ర్గంపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ లు పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంప‌ల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో రాజా సింగ్‌ను రిమాండ్‌కు పంపాలంటూ పోలీసులు దాఖ‌లు చేసిన అఫిడ‌విట్‌ను తిర‌స్క‌రించింది నాంప‌ల్లి కోర్టు. ఓ వ్య‌క్తిని అరెస్ట్ చేయాలంటే 41ఏ సీఆర్పీసీ సెక్ష‌న్ కింద నోటీసులు ఇవ్వాల్సి ఉంద‌ని, అయితే రాజా సింగ్‌కు అలాంటి నోటీసులు ఇవ్వ‌కుండానే అరెస్ట్ చేశారంటూ పోలీసుల‌ను త‌ప్పుబ‌ట్టింది నాంప‌ల్లి కోర్టు. అదే స‌మ‌యంలో రాజా సింగ్ త‌ర‌ఫు న్యాయవాదులు కూడా త‌మ క్ల‌యింట్‌కు జ‌రిగిన అన్యాయాన్ని కోర్టు దృష్టికి తీసుకువ‌చ్చారు.

ఈ సంద‌ర్భంగా ఇటు ప్ర‌భుత్వ లాయ‌ర్లు, అటు రాజా సింగ్ లాయ‌ర్ల మ‌ధ్య దాదాపుగా 45 నిమిషాల పాటు తీవ్ర స్థాయిలో వాదోప‌వాదాలు కొన‌సాగాయి. రాజా సింగ్‌ను అరెస్ట్ చేసే స‌మ‌యంలో పోలీసులు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను పాటించ‌లేద‌ని రాజాసింగ్ త‌ర‌ఫు న్యాయ‌వాదులు కోర్టుకు తెలిపారు. ఇరు వ‌ర్గాల వాద‌న‌లు సావ‌దానంగా విన్న న్యాయ‌మూర్తి… రాజా సింగ్ రిమాండ్ రిపోర్ట్‌ను తిర‌స్క‌రిస్తున్న‌ట్లు తెలిపారు. అంతేకాకుండా ఆయ‌న‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. రాజా సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన తీరు బాగా లేద‌ని కూడా ఈ సంద‌ర్భంగా న్యాయ‌మూర్తి పేర్కొన్న‌ట్లు స‌మాచారం. అయితే మరికాసేపట్లో రాజాసింగ్ విడుదల కానున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version