తెలంగాణలోని గుండా రాజకీయాలను అంతం చేస్తాం – కేంద్ర మంత్రి

-

తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత గుండా రాజకీయాలు అంతం చేస్తామని ప్రకటించారు సహకార శాఖ సహాయ మంత్రి బి.ఎల్. వర్మ. వరంగల్ పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా హనుమకొండ కు చేరుకున్నారు కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృధి శాఖ మరియు సహకార శాఖ సహాయ మంత్రి బి.ఎల్. వర్మ.

ఈ సందర్భంగా సహకార శాఖ సహాయ మంత్రి బి.ఎల్. వర్మ మాట్లాడుతూ….. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయి…మోదీ ప్రధాన మంత్రి అయిన తరువాత ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా లక్షలాది పేదలకు ఇండ్ల నిర్మాణం చేశారన్నారు.

కిసాన్ సమ్మన్ నిధి ద్వారా రైతయాలకు పెట్టుబడి సహాయం అందిస్తుంది.. ఆయుష్మాన్ భారత్ ద్వారా మెరుగైన వైద్యం కోసం కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని వెల్లడించారు. కరోనా సమయంలో మోదీ పేద ప్రజలను ఆదుకునేందుకు ప్రతేక నిధులు కేటాయించారు… కరోనా వ్యాక్సిన్ ఉచితంగా పంపిణీ చేసి కరోనా కట్టడికి విశేషమైన కృషి చేశారన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం సాధించే దిశగా పని చేస్తున్నాం.. టిఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ కార్యకర్తల పై దాడులకు పడుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version