సంక్రాంతికి ఇందిరమ్మ ఇండ్ల సాంక్షన్ చేస్తాం : పొంగులేటి

-

హనుమకొండ కలెక్టరేట్ లో అధికారులతో మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. ఇందులో పొంగులేటి మాట్లాడుతూ.. వరంగల్ ను పూర్తి స్థాయిలో అభివృధ్ధి చేయాలని సీఎం సూచించారు. భద్రకాళి ట్యాంక్ బండ్, టెక్టైల్ పార్క్ అభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం నిధులు కేటాయించాము. పర్యావరణానికి హాని కలగకుండా ఆర్టీసీని అప్ డేట్ చేస్తున్నాం. అందుకే ఎలక్ట్రికల్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నాం. హైదరాబాద్ కు ఏ టెక్నాలజీ వచ్చినా…వెంటనే వరంగల్ కు కూడా ఆ టెక్నాలజీ తెస్తాం.

ఇక ఉమ్మడి ఏపీలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాము. 4.5 లక్షల ఇండ్లను ఇప్పుడు మొదటి విడతలో ఇస్తాము. రాబోయే నాలుగేళ్లలో 20 లక్షల ఇండ్లు కట్టిస్తాం. అన్ని మండలాల్లో మాడల్ ఇందిరమ్మ ఇండ్ల యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాను. సంక్రాంతికి ఇందిరమ్మ ఇండ్ల సాంక్షన్ చేస్తాం. ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని పంపించాము. 80 లక్షల మంది ఇందిరమ్మ ఇండ్లకోసం దరఖాస్తు చేసుకున్నారు. వాటిని స్క్రూటినీ చేసి లబ్ధిదారులకు పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఇండ్లు అందిస్తాం. దరఖాస్తు చేసుకోని వాళ్ళు భయపడాల్సిన పనిలేదు. ఇందిరమ్మ ఇండ్లు నిరంతర ప్రక్రియ.. లబ్ధిదారులకు తప్పకుండా ఇస్తాం అని పొంగులేటి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news