బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. మేము ఏ పథకాన్ని ఆపుతున్నమని చెప్పడం లేదు. నూతనంగా ఉద్యోగాలు పొందుతున్న ప్రయత్నం చేశాం. విద్యా బోధన సక్రమంగా అందించాలని నూతనంగా నియమైకమైన అధ్యాపకులకు చెప్పే ప్రయత్నం చేశాం. అప్పులు ఉన్నాయని తెలుసు ఆర్థిక వ్యవస్థీకరణ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ పరిపాలించే అనుభవం ఉంది. పాత పథకాలు కొనసాగిస్తూనే కొత్త పథకాలు అమలు చేస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు జరిగే సందర్భంలో కేంద్ర ప్రభుత్వ పెద్దన్న లాగా రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం ఉండాలి. అందమైన భవనాలు కట్టి తెలంగాణ ఆర్థికంగా గొప్పగా ఉందని చూపెట్టే ప్రయత్నం చేశారు. ఎక్కడ మేము తప్పించుకునే ప్రయత్నం చేస్తలేము.
మాట్లాడితే తులం బంగారం గురించి మాట్లాడుతున్నారు.. 15 లక్షల రూపాయలు ఇచ్చారా. రైతులకు పెన్షన్ ఇస్తామన్నారు.. రైతులకు ఉరి చట్టాలు తెచ్చారు. బీజేపీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఎన్ని ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చే నిధులు కూడా వాపసు ఇచ్చే పరిస్థితి లేదు బాత్రూం మీద ఫోటో పెట్టాలని రేషన్ షాపు లో మీద ఫోటోలు పెట్టాలని అంటారు. నిర్మల్ నియోజకవర్గంలో 23,906 మంది రైతులకు 202.55 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. రెండు లక్షల లోపు వరకు రైతు రుణమాఫీ చేశాం. తెలంగాణ ప్రభుత్వం ఒక్క నిర్మల్ నియోజకవర్గానికి 202 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసింది. దీని మీద చర్చ చేయడానికి నిర్మల్ కి సిద్ధంగా ఉన్నాం అని పొన్నం పేర్కొన్నారు.