కార్తీకమాసం సందర్భంగా రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హుస్నాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. సతీ సమేతంగా సత్యదేవుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమీపంలోని మహిళలు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దేవుడిని ప్రార్థించినట్లు వెల్లడించారు.
ఇదిలాఉండగా,రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సర్వే పూర్తయితే రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య,వైద్యం పరంగా వెనుకబడిన తరగతుల వారికి న్యాయం జరుగుతుందని మంత్రి ఆకాక్షించారు.