కేంద్రమంత్రి బండి సంజయ్‌కు మంత్రి పొన్నం స్ట్రాంగ్ కౌంటర్

-

కేంద్రమంత్రి బండి సంజయ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని బండి సంజయ్ నిన్న కామెంట్ చేశారు. కేవలం ముస్లింలకు లబ్ధి చేసేందుకు కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చిందని ఆరోపించారు.

తాజాగా బండి వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్లను రాష్ట్రమే అమలు చేయాలని చెబుతున్న సంజయ్.. అదే మాటపై కేంద్రం నుంచి అధికారిక ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. ముస్లిం రిజర్వేషన్లపై అదే పనిగా మాట్లాడుతున్న బండి సంజయ్.. ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ.. అక్కడ 4 శాతం ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తారా? అని ప్రశ్నించారు.
ఢిల్లీలోనూ ముస్లింలకు రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయని అవి రద్దు చేయగలరా? అని ప్రశ్నలు సంధించారు.

Read more RELATED
Recommended to you

Latest news