ఫార్మాసిటీలో భూసర్వే.. ఎదురుతిరిగిన రైతులు

-

సీఎం రేవంత్ రెడ్డి సర్కారుకు ప్రజలు, విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.అటు మెగాఫార్మాసిటీ.. ఇటు హెచ్‌సీయూ భూముల జోలికి రావొద్దని అటు రైతులు, ఇటు విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు.

తాజాగా ఫార్మా సిటీ భూ సర్వే కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కర్త మేడిపల్లి గ్రామంలో ఫార్మాసిటీ కోసం అధికారులు భూసర్వే చేపట్టారు. కోర్టులో స్టే ఆర్డర్ ఉందని చెప్పినా వినకుండా భూ సర్వే చేసి హద్దు రాళ్ళను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. దీంతో రైతులు పెద్దఎత్తున అక్కడకు చేరుకుని ఆందోళన చేపట్టారు.ఈ క్రమంలోనే రైతులను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పీఎస్కు తరలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news