నైట్ పార్టీలపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

-

నగర శివార్లలో ఫామ్ హౌస్ కల్చర్, నైట్ కల్చర్ పెరుగుతోంది. వాటికి మేము ఎలాంటి అభ్యంతరం తెలపడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం లేదని, ఎటువంటి పార్టీలు నిర్వహించినా చట్టానికి లోబడే ఉండాలన్నారు. అశ్లీలత, డ్రగ్స్ లేకుండా పార్టీలు చేసుకుంటే ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేశారు.

పొరుగున వారికి ఇబ్బంది కలిగేలా పెద్ద పెద్ద శబ్దాలతో పార్టీలు నిర్వహిస్తే వారి ఫిర్యాదు మేరకు అధికారులు దాడులు చేస్తే దాన్ని ప్రభుత్వం‌పై నెట్టడం సరికాదన్నారు. ఉద్యమాలు, నిరసనలపై తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం లేదని మంత్రి పొన్నం గుర్తుచేశారు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై పునః సమీక్షించే ప్రసక్తే లేదని వెల్లడించారు. ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలో ప్రయత్నిస్తామన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు మా ప్రభుత్వానికి సూచనలు చేస్తే ఎలాంటి అభ్యంతరం లేదని, వాటిని స్వీకరిస్తామని మంత్రి పొన్నం క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version