టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఆయనతో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ రేణుకాచౌదరి ఉన్నారు. అయితే ఇటీవల ఖమ్మంలో నెలకొన్న పరిస్థితులపై మంత్రి పువ్వాడపై రేవంత్ రెడ్డి, రేణుక చౌదరి లు నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి, రేణుక చౌదరీలకు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఒక ఐటెం అని, కొడంగల్‌లో రేవంత్ రెడ్డి పోటీచేసిన సందర్భంలో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాలు వదిలి పెడతా అని చెప్పాడు.. ముందు ఆ ఛాలెంజ్ కు కట్టుబడి ఉండు అంటూ మంత్రి పువ్వాడ విమర్శించారు.
మమతా ఆస్పత్రిపై విచారణ చేయాలని గవర్నర్ కు రేవంత్ ఫిర్యాదు చేశాడు… మమతా కాలేజీపై చేస్తున్న ఆరోపణలపై ఎటువంటి విచారణ అయినా చేసుకోవచ్చన్నారు. ఓటుకు నోటు కేసులో చిప్పకూడు తిని వచ్చావు అంటూ మండిపడ్డారు. రేణుక చౌదరికి ఒక్కరు రావాలంటే భయం అందుకే రేవంత్ రెడ్డిని తీసుకొని వచ్చారని మంత్రి పువ్వాడ సెటైర్లు వేశారు. రేణుక చౌదరి బతుకే డ్రగ్స్, పబ్బు, క్లబ్బు.. ఆమె గురించి ఖమ్మం ప్రజలకు తెలుసని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.