బ్రేకింగ్ : తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్ – 1 నోటిఫికేషన్ విడుదల

-

నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల సీఎం కేసీఆర్ చెప్పిన విధంగానే తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ వరుస నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఇప్పటికే పోలీసు విభాగంలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల కాగా.. ఇవాళ గ్రూప్ – 1 నోటిఫికేషన్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) విడుదల చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న 503 పోస్టులను తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయనుంది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన అనంతరం తొలిసారిగా గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ఇదే కావడం విశేషం.

అంతేకాకుండా ఇంటర్వ్యూలు లేకుండానే పోస్టులను భర్తీ చేయనున్నారు. మే 2 నుండి మే 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను టీఎస్‌పీఎస్సీ స్వీకరించనున్నది. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది. గ్రూప్ వన్ దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటే మొదట టీఎస్పీఎస్సీ వెబ్ సైట్‌లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.. ఇంతకు ముందే ఓటీఆర్‌ చేసుకున్నవారు అప్‌గ్రేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version