ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణ చూస్తారు : కేంద్రానికి పువ్వాడ వార్నింగ్

-

ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణ చూస్తారని కేంద్ర ప్రభుత్వానికి పువ్వాడ అజయ్ వార్నింగ్ ఇచ్చారు. ధాన్యం సేకరణ పై మోడీ ,కేంద్రం స్పందించకపోతే ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆహారపు అలవాట్ల గురించి పీయూష్ గోయల్ మాట్లాడతారని మండిపడ్డారు. ఉగాది తర్వాత నూక ఎవరో..పొట్టోవరో తేలుతుందని వార్నింగ్ ఇచ్చారు.

తెలంగాణ ను ఇబ్బంది పెడుతున్నాం అని కేంద్రం అనుకుటుందేమో …అది శునకన0దం మాత్రమేనని ఫైర్ అయ్యారు.  ధాన్యం కొనుగోలు చేసేలా కేంద్రం మెడలు వంచుతామని పువ్వాడ అజయ్ అన్నారు. తెలంగాణలోని గ్రామపంచాయితీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్, అన్ని మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులు వ్యవసాయం ఉన్న చోట్ల తీర్మాణాలు చేయాలని.. తీర్మాణాలను ప్రధాని పంపాలని పువ్వాడ అజయ్ అన్నారు.  ఉగాది తరువాత నుంచి భారీగా ఆందోళన కార్యచరణ ఉంటుందని.. ఇది దక్షిణాదికి కూడా పాకుతుందని.. ఉత్తరాదిలో రైతుల ఆందోళనకు క్షమాపణ చెప్పారన్నారు.  కేంద్రం నుంచి తెలంగాణకు ఎలాంటి సాయం అందడం లేదని ఆయన విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version