మనిషి జీవితాన్ని కంటికి కనిపించని ఎన్నో శక్తులు శాసిస్తాయి. వాటి ప్రభావం మనపై కచ్చితంగా ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉండగలం. లేదంటే.. ఎప్పుడూ ఏదో ఒక ఆందోళన. సైన్స్ ను నమ్మే ఈరోజుల్లోనూ.. న్యూమారాలజీని నమ్మే వారు ఉన్నారు. జ్యోతిష్యశాస్ర్రాన్ని కాదని మనం ఏపని చేయలేం. రంగురాళ్లు, ఉంగరాలు, పగడాలు, వజ్రాలు.. మీరు ఇవి పెట్టుకునే వారిని చూసే ఉంటారు. వాళ్లే షోపీస్ లెక్క వాడటం లేదు. వాటి వెనుక పెద్ద స్కెచ్చే ఉంది. ఈరోజు మనం పుట్టిన నెల ఆధారంగా.. ఎలాంటి వజ్రం లేదా రాయి ధరించాలో చూద్దాం.
జనవరి- గోమేదికం (garnet) రాయి ఈ నెలలో పుట్టినవారికి లక్కీ స్టోన్. దీన్ని తొడిగిన వారి మనసు ప్రశాంతంగా ఉంటుంది. భయాలు, ఆందోళనలు తొలగిపోతాయి.
ఫిబ్రవరి- కురువింత (amethyst) రాయి వీరికి లక్కీ స్టోన్. జనరల్‌గా ఫిబ్రవరిలో పుట్టిన వారికి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందనీ… అలాంటి వారు ఈ రాయి ధరిస్తే మంచిదని పండితులు అంటున్నారు.
మార్చి- నీలపు రత్నం (aquamarine) వీరికి మంచిది. ఇది మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రమాదాలను దూరం చేస్తుంది.
ఏప్రిల్- వజ్రం ధరించండి. ఇది నెగెటివ్ ఎనర్జీలు, చెడు శక్తుల నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది.
మే – ఈ నెలలో పుట్టిన వారు పచ్చ లేదా మరకతం అని పిలిచే (Emerald) రాయిని తొడిగితే వారికి మేలు జరుగుతుంది. అది వారి అదృష్ట రాయి.
జూన్- ముత్యం అనేది స్వచ్ఛతకు, ప్రశాంతతకూ సంకేతం. ఈ నెలలో పుట్టినవారు ముత్యం ధరించాలట.
జులై- నిరాశ, నిస్పృహల నుంచి బయటపడాలంటే… ఈ నెలలో పుట్టిన వారు.. తప్పని సరిగా రూబీ రాయిని తొడగాలని… అది ప్రేమను తెస్తుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు.
ఆగస్టు- వీరికి ఒత్తిడి, శ్రమ ఎక్కువగా ఉంటాయట. అందువల్ల వారు పచ్చ (green period stone) రాయిని తొడగాలి. ఇది ఒత్తిడిని పోగొడుతుంది.
సెప్టెంబర్- వీరు కచ్చితంగా నీలకాంత మణి (nilakanta mani)ని ధరించాలని పండితులు సూచిస్తున్నారు.
అక్టోబర్- ఈ నెలలో జన్మించిన వారు ఓపాల్ రత్నం (opal) ధరించాలి. ఇదేం రత్నం అని మీకు అనిపించవచ్చు. ఒపాల్ అనేది అనేక రంగులతో లభించే రత్నం… ఎక్కువగా తెలుపు లేదా నీలి రంగుల్లో ఈ రాయి ఉంటుంది. ఈ రత్నం శాంతిని తెస్తుంది. కంటి చూపును పెంచుతుంది.
నవంబర్- వీరు పుష్పరాగం (topaz) ధరించాలి. ఇది సత్సంబంధాలను మెరుగుపరుస్తుంది.
డిసెంబర్- మీరు మణి (turquoise)ని ధరించాలి. ఇది ఆకాశం రంగులో ఉంటుంది. దీని లోపలికి వెలుగు వెళ్లదు. ఇదే రాయి ప్రత్యకత.
అప్పుడప్పుడు మనం ఫ్రెండ్స్ వి, ఇంట్లో వాళ్లవి రింగ్స్ పెట్టుకుంటాం. ఎట్టిపరిస్థితుల్లోనూ.. వేరే వాళ్లవి రాళ్లు, వజ్రాలు ఉన్న రింగ్స్ ను మీరు పెట్టుకోవద్దు. దాని ద్వారా లేనిపోని సమస్యలు వస్తాయట. జ్యోతిష్యం శాస్త్రం ప్రకరాం మాత్రమే ఈ సమాచారం మీకు అందించటం జరిగింది. మనలోకం సొంతంగా రాసింది కాదు. నమ్మకం లేని వారు.. లైట్ తీసుకోవడమే..!